NLG: మర్రిగూడలో యూరియా పంపిణీ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నా ఎరువులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు మన గ్రోమోర్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. నిర్వాహకులు నిల్వలను అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.