NLR: కందుకూరు నియోజకవర్గంలోని మాలకొండ శ్రీ మాలకొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారి హుండీ ఆదాయం రూ.9,17,554గా వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తుల సమక్షంలో లెక్కింపు జరగగా, ప్రసాద విభాగం ద్వారా రూ.2,43,163 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.