AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో విజయవాడకు చెందిన ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడి ఉంటే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.