EG: రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన క్రీడాయ్ ప్రతినిధులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిడింగొయ్యిలోని క్రీడాయ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. బిల్డర్లు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.