ATP: తాడిపత్రి పట్టణంలోని శ్రీవాణి విద్యాసంస్థల 2000 సంవత్సరపు బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల నాటి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.