NLG: నల్గొండ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధితో ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గత పాలనలో మౌలిక వసతులు, పేదల సమస్యలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. రేషన్ కార్డులు, ఇళ్ల పంపిణీ, ప్రాజెక్టుల పూర్తి విషయంలో విఫలమయ్యారని విమర్శించారు. కాలేశ్వరం పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు.