తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘జన నాయగన్’ మూవీ తన చివరి చిత్రమని వెల్లడించారు. మలేషియాలో జరిగిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ.. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని చెప్పారు. ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారికోసం మరో 30 ఏళ్లు నిలబడతానని అన్నారు.