ATP: మంత్రి పయ్యావుల కేశవ్ విజయవాడలో ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెర్ప్ డైరెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ శైలజతో కలిసి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల పురోగతిని ఆయన చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.