కరీంనగర్లో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 8వ కాలనీకి చెందిన కాంటేవాడ రాధ (50+)మహిళల 400 మీటర్ల పరుగు విభాగంలో ప్రతిభ చూపారు. ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకున్నారు. దీంతో జనవరి 30 నుంచి రాజస్థాన్ అజ్మీర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.