PPM: ప్రకృతిని దైవంగా భావించి, తాము పండించిన మొదటి పంటను ప్రకృతికి అర్పించే గొప్ప సంప్రదాయానికి పార్వతీపురం మన్యం జిల్లా వేదిక అని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గిరిజన ఆచారాల ప్రతీకగా నిలిచే ‘కందికొత్తలు’ పండుగలో ఆదివారం కలెక్టర్ పాల్గొని భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలలో మమేకమైయారు.