నూతన సంకల్పం, లక్ష్యాలతో 2026లోకి వెళ్తామని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఈ ఏడాది ఎన్నో ఘన విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. జనవరి 12న వికసిత్ భారత్ యంగ్ లీడర్ రెండో సదస్సు నిర్వహించనున్నట్లు మోదీ వెల్లడించారు. స్టార్టప్, అగ్రకల్చర్, ఫిట్నెస్ అంశాల్లో యువత ఆవిష్కరణలు బాగున్నాయని తెలిపారు.