HYD: కాటేదాన్ టాటా నగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.