JN: దేవరప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆదివారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారీ మెజారిటీతో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను ఎర్రబెల్లి అభినందించారు. గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని సూచించినట్లు వారు తెలిపారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు.