MHBD: న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ అన్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండలంలోని గ్రామాల్లో ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి రోడ్లపై గుంపులు గుంపులుగా తిరగరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.