ADB: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్‌కు చెందిన బృందం సభ్యులు జిల్లాలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు 3 రోజుల పాటు వినయ్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు పర్యటిస్తారు. 30న నార్నూర్ బ్లాక్‌లో, జనవరి 1, 2 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.