AP: భారత పారిశ్రామిక ధ్రువతార రతన్ టాటా జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. ‘దార్శనిక పారిశ్రామికవేత్త, మానవత్వం ఉన్న నాయకులు, ఆయన తన జీవితాన్ని వ్యాపార శ్రేష్టత, దాతృత్వానికి అంకితం చేశారు. రతన్ టాాటా సమగ్రత, వినయం, సమాజం పట్ల నిబద్ధత మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఆయనకు నా వినయపూర్వకమైన నివాళులు’ అని Xలో పోస్టు చేశారు.