సత్యసాయి జిల్లా టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన ముతుకూరు బీబీని పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు బొట్టు క్రిష్ణ, పూజ మొబైల్ సాయి, సన్నా ఈరప్ప, జింకల రాజన్న ఆమెను కలిసి పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, జిల్లా సమస్యల పరిష్కారానికి ఆమె నిరంతరం కృషి చేయాలని వారు కోరారు.