KNR: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు.