Anchor Rashmi: షాకింగ్ వీడియో షేర్ చేసిన యాంకర్ రష్మీ
భారీ సంఖ్యలో తిమింగలాలను చంపుతున్న వీడియోను యాంకర్ రష్మీ షేర్ చేశారు. యానిమల్ లవర్ అయిన రష్మీ ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షసులు మనుషుల రూపంలోనే మనమధ్యే ఉంటారని ట్వీట్ చేశారు.
యాంకర్ రష్మీ(Anchor Rashmi) జంతుప్రేమికురాలన్న సంగతి అందరికీ తెలిసిందే. మూగ జీవాలకు ఎటువంటి అన్యాయం జరిగినా ఆమె స్పందిస్తూ ఉంటుంది. జీవ హింసకు పాల్పడే వారిపై సోషల్ మీడియా వేదిక విరుచుకుపడుతుంటుంది. రష్మీ యానిమల్ లవర్(Animal Lover)గా మాంసాహారం తినకపోవడమే కాకుండా జంతువుల ఉత్పత్తులైన పాలు, గుడ్లు వంటికి కూడా తిననని గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ఓ షాకింగ్ వీడియో(Video)ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
యాంకర్ రష్మీ షేర్ చేసిన వీడియో:
https://twitter.com/i/status/1666206535830102028
అనేక తిమింగలాలను సంహరించే ఓ వీడియోను యాంకర్ రష్మీ ట్వీట్ చేశారు. ఆమె షేర్ చేసిన వీడియో దారుణంగా ఉంది. తిమింగలాల రక్తంతో ఆ ప్రాంతం అంతా ఎర్రబడింది. వీడియోలో తిమింగలాలను చంపే వ్యక్తులను ఉద్దేశించి ఆమె ఓ పోస్ట్ షేర్ చేసింది. రాక్షసులు ఎక్కడో లేరని, అలాంటి వాళ్ల రూపంలో మనతోనే ఉంటారని ఆమె కామెంట్ చేస్తూ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం రష్మీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మధ్యనే హైదరాబాద్లో కూడా ఓ బాలుడు వీధికుక్కల దాడిలో చనిపోయాడు. ఆ సమయంలో కూడా రష్మీ తీవ్ర విమర్శలు చేసింది. మనుషుల కంటే తనకు వీధి కుక్కల ప్రాణాలే ఎక్కువా అంటూ ఆమె చాలా మంది టార్గెట్ చేశారు. అయినా ఆమె తన పంతం విడవలేదు. తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం కామెంట్స్ చేసింది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని కామెంట్స్ చేసింది. వీధి కుక్కల తప్పేమి లేదని తెలిపింది. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలలో యాంకరింగ్ చేస్తోంది. సినిమా అవకాశాలు లేకపోవడంతో బుల్లితెర షోలకు మాత్రమే పరిమితమైంది.