ASF: కౌటాల మండల కేంద్రం గ్రామపంచాయతీలో విధులు నిర్వహించే కార్యదర్శి సాయికృష్ణపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సురేష్ అనే వ్యక్తి శనివారం ఫిర్యాదు చేశారు. తన సొంత భూమిలో హనుమాన్ ఆలయ నిర్మాణ పనులు చేస్తుంటే పంచాయతీ కార్యదర్శి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే తన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.