గోముఖాసనం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది. ఇది వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కండరాలను సాగదీయడంలో సహాయపడుతుంది. కాళ్ల తిమ్మిరిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గోముఖాసనంలో సాగదీయడం వల్ల మొత్తం ఉదర ప్రాంతం రద్దీని తగ్గిస్తుంది. ఇది మూత్రపిండాలు, కాలేయం, క్లోమాన్ని మసాజ్ చేస్తుంది. ముఖ్యంగా నడుము నొప్పిలో కీలక పాత్ర పోషిస్తుంది.