MDK: శివంపేట మండలం దొంతి గ్రామంలో కేవల్ కిషన్ 65వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కేవల్ కిషన్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేవల్ కిషన్ నిరంతరం ప్రజా కార్మిక సమస్యలపై పోరాటం చేసేవారని మండల నాయకులు శంకర్ పేర్కొన్నారు.