మెదక్ చర్చిలో భద్రతా ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. చర్చి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా వేడుకలు నిర్వహించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు.