SRPT: కోదాడ పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని ఏ వీధిని చూసినా చెత్తకుప్పల దర్శనమే కనిపిస్తోంది. వీధి రోడ్లపై చెత్త చిందరవందరగా పేరుకుపోయి ఉండటంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుంచి వెలువడుతున్న దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.