ATP: ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని రాజేష్ విన్నవించారు.