ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ‘బడా నిర్మాతలు వర్సెస్ చోటా నిర్మాతలు’ అన్నట్లుగా మారాయి. చిన్న చిత్రాల నిర్మాతల తరఫున నిర్మాత ప్రసన్న కుమార్ పలు కీలక డిమాండ్లు చేశారు. ‘చిన్న సినిమాలకు కూడా థియేటర్లు కేటాయించాలి. అలాగే, బెనిఫిట్ షోలకు అవకాశం కల్పించాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం కొందరి చేతుల్లోనే ఉంది. మా సమస్యలు పరిష్కరిస్తే ఎన్నికల నుంచి విత్ డ్రా చేసుకుంటాం’ అని తెలిపాడు.