E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి 10 వినతి పత్రాలు స్వీకరించారు. పింఛన్లు, రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా వినతులు రావడంతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.