W.G: ఆకివీడులోని ఐ.భీమవరం జాతీయ రహదారి నుంచి స్మశాన వాటికకు వెళ్లే మార్గంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను కూటమి నాయకులు శుక్రవారం ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 20 లక్షలతో 156 మీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించనున్నారు. కార్యక్రమంలో AMC ఛైర్మన్ బొల్లా వెంకట్రావు, పట్టణ TDP అధ్యక్షుడు గంధం ఉమా పాల్గొన్నారు.