KDP: 20 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను తమకే అప్పగించాలంటూ సిద్ధవటం మండలం మాధవరం గ్రామానికి చెందిన దళితులు డిమాండ్ చేస్తున్నారు. సర్వేనెంబర్ 967లోని 140 ఎకరాల భూమిని తమకు పంపిణీ చేయాలంటూ 70 ఎస్సీ కుటుంబాలు చాలాకాలంగా పోరాడుతున్నాయి. ప్రస్తుతం కొందరు ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ భూములు తమకు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.