NLR: సంగం మండలంలోని సిద్దీపురం గ్రామంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని శుక్రవారం విద్యుత్ శాఖ ఏఈ మన్మథరావు, సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.