JN: దేవరుప్పుల మండల కేంద్రంకోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యాధికారులు ఉన్నా ఒక్కరు కూడా సకాలంలో రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బందిని అడిగితే ఇంకా డాక్టర్ రాలేదు, వచ్చే వరకు ఉండండి లేదంటే జిల్లా ఆసుపత్రికి వెళ్ళండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతారు అని పలువురు రోగులు వాపోయారు. వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.