NZB: క్రీడల్లో ప్రతిభ చాటి సిరికొండ మండల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గత నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వీరు, ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఏటూరునాగారంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పీడీ కే. ప్రశాంత్ తెలిపారు.