VZM: జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికైన వారిని యోగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బూర్లే శ్రీధర్ శుక్రవారం విజయనగరంలో అభినందించారు. విశాఖలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో 14-18 విభాగంలో వై దినేష్ ప్రథమస్థానం సాధించారు. 30-40 విభాగంలో శివ కుమార్ ద్వితీయ స్థానం కైవసం చేసుకుని జాతీయ పోటీలకు ఎంపికయ్యారని ఆయన చెప్పారు.