ఇటీవల విమాన సర్వీసుల సంక్షోభం వల్ల నష్టపోయిన ప్రయాణికులకు రూ.10 వేల వోచర్ల పంపిణీని ఇండిగో సంస్థ ప్రారంభించింది. విమానం బయల్దేరడానికి ముందు 24 గంటల్లోగా సర్వీసు రద్దయిన వారికి DGCA మార్గదర్శకాలకు అనుగుణంగా రూ.5 వేల నుంచి రూ.10 వేల పరిహారం ఇస్తున్నారు. టికెట్ డబ్బులను ఇప్పటికే రిఫండ్ చేయగా.. అందని వారికి త్వరలోనే పంపిణీ చేస్తామని సంస్థ తెలిపింది.