KMM: జిల్లా జర్నలిస్టుల సంక్షేమానికి తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవ అన్నారు. TWJF ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల ఇళ్ల స్థలాల మంజూరుకు సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ఆయన జర్నలిస్టుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవని, వారికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు.