SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. రాజన్న, భీమన్నను దర్శించుకున్న భక్తులు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం, బోనాలు చెల్లించడం అనవాయితీ. ఈ క్రమంలో ఇవాళ వేకువజామున నుండే వేలాది భక్తులు బోనాలతో తరలివచ్చారు.