HYD: న్యూ ఇయర్ వేడుకల వేళ మందుబాబులపై కఠిన నిఘా ఉంటుందని ట్రాఫిక్ ఏడీసీపీ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సిటీలోని 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇస్తే ఆర్సీ రద్దు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.