SKLM: ఆమదాలవలసలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.