KDP: బద్వేలులోని వ్యాపారులు జనవరి 1 నుంచి సిద్ధవటం రోడ్డులో ఉన్న రైతు బజార్లో మాత్రమే వ్యాపార కార్యకలాపాలు సాగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన రైతులతో మాట్లాడుతూ.. రైతు బజార్లో తప్ప ఎక్కడ కూడా వ్యాపార కార్యకలాపాలు చేయరాదని పేర్కొన్నారు. తోపు బండ్లు కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా రైతు బజార్లోకి వెళ్లాలని తెలిపారు.