కోనసీమ: అమలాపురం-రావులపాలెం ప్రధాన రహదారిపై పెంకులపాటి గరువు వద్ద గురువారం రాత్రి కంటైనర్ లారీ ఓ చెట్టును ఢీ కొట్టడం వల్ల పెట్టుకొన్న విరిగి లారీ వెనుక వస్తున్న కారు మీద పడింది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. కారులో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు.