E.G: అనపర్తి నియోజకవర్గంలో మార్చి12న వైసీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కోరారు. వైసీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ వేడుకలను పండగ తరహాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు, పట్టణ, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలను పెద్ద ఎత్తున ఎగురవేయాలన్నారు.