KNR: కొత్తపల్లి మండలం ఎలగందుల నూతన పాలకవర్గం సర్పంచ్ అంజయ్య ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధి, చారిత్రక ఎలగందుల ఖిల్లా ప్రాముఖ్యతను మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ వెంటనే జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఖిల్లా అభివృద్ధికి, గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.