ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తిరుమలలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. ఈ మేరకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. మోహన్ భగవత్ తిరుమల పర్యటన నేపథ్యంలో భక్తుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, నిన్న ఆయన తిరుమలలో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.