AP: నెయ్యి అంశంపై తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని జగన్ విమర్శించారు. ‘ఇందాపూర్-హెరిటేజ్ సంబంధాలపై నిలదీస్తే జవాబు లేదు. సంగం-వైష్ణవి డెయిరీలపైన నోరు మెదపలేదు. నెయ్యి టెండర్లలో రూ.200 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. ఏడాదిలోనే కిలో నెయ్యికి రూ.365 పెంచారు. CBN వచ్చాక పరకామణిలో రూ.కోటి విలువైన బంగారం చోరీ జరిగింది. దొంగకు బెయిల్ ఇప్పించారు’ అంటూ మండిపడ్డారు.