E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెంలోని రజకుల చెరువుకు నిబంధనలకు విరుద్ధంగా లీజు విధించారని రజక జన సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య గురువారం ఆరోపించారు. జీవోలను అనుసరించకుండా ఏకంగా 200 శాతం పెంచి రూ.75 వేలు లీజు నిర్ణయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. మత్స్యశాఖ రిపోర్టు ఆధారంగా లీజు ఉండాలని డిమాండ్ చేశారు.