KKD: పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు దుర్గా రమేష్, చేనేత సహకార సంఘాల JAC ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రమేష్ మాట్లాడుతూ.. సంక్రాంతి లోపు చేనేత సహకార సంఘాలకు బకాయిలను వందశాతం ఆప్కో చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 చేనేత కుల సంఘాలను కలుపుకుని రిలే, ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.