AP: 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘దేశాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లే శక్తి, సామర్థ్యం ప్రధాని మోదీకి ఉంది. మోదీ దేశం గురించి ఆలోచిస్తే.. నేను తెలుగువారి గురించి ఆలోచిస్తున్నా. అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి. అమరావతి అభివృద్ధి క్వాంటం వ్యాలీతో ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు.