JGL: పెన్షన్ దారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వ పెన్షదారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బుధవారం రిటైర్మెంట్ బకాయిలు ఏక మొత్తంగా చెల్లించాలని నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎమ్మెల్యే పాల్గొని సంఘీభావం తెలిపారు.