PDPL: అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క గద్దెల పునర్నిర్మాణ పనులను, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ కూర్ బుధవారం రాత్రి ప్రారంభించారు. కోటి రూపాయలతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా పనులు నాణ్యతతో చేపట్టాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.