కృష్ణా: పోరంకి టీడీపీ కార్యాలయంలో నూతన జిల్లాప్రధాన కార్యదర్శిగా ఎంపికైన గోపు సత్యనారాయణ ఎమ్మెల్యే ప్రసాద్ని మర్యాదపూర్వకంగా కలవగా,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధి అందిస్తున్నామని, మనం ప్రజలకు చేసే మంచిని విరివిగా గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సూచించారు.